
* కరూర్ ఘటనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశాడనే ఫిర్యాదు
ఆకేరున్యూస్ డెస్క్: తమిళ వెట్రి కళగం అధినేత సినీ నటుడు విజయ్ నిర్వహించిన కరూర్ రోడ్ షో లో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెంది 50 మందికి పైగా గాయలపాలైన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో విజయ్ ర్యాలీపై తప్పుడు వార్తులు ప్రసారం చేసి నందుకు తమిళనాడు యూ ట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీకే పార్టీకి వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రసారం చేస్తున్నాడని అతనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి టీవీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు మది అలగన్ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 21 మందిపై కేసులు నమోదు చేశారు.
……………………………….