
ఆకేరు న్యూస్, డెస్క్ : యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(YouTuber Jyoti Malhotra)కు 4 రోజుల రిమాండ్ విధిస్తూ హరియాణ హిసార్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నట్లు మల్హోత్రా ఒప్పుకున్నారని తెలిసింది. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్న ఆరుగురిని హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో హిస్సార్ ప్రాంతానికి చెందిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్(Travel Blagour), యూట్యూబర్. యూట్యూబ్‌లో ఆమె ఛానల్‌కు 3.7 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. పాక్ అధికారుల సాయంతో పలుమార్లు దాయాది దేశంలో ఆమె పర్యటించారు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో పాక్ (Pakisthan) వ్యక్తులతో మాట్లాడిన ఆమె, దేశ భద్రతకు ముప్పు తెచ్చే సమాచారాన్ని చేరవేసిందని అధికారులు పేర్కొన్నారు. 2023లో పాక్‌కు వెళ్లిన బృందంలో తాను ఉన్నట్లు, అప్పుడే అహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్‌ను కలిసినట్లు పోలీస్ విచారణలో జ్యోతి అంగీకరించినట్లు చెప్పారు. పాకిస్థాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో సంబంధం కొనసాగించిందని, ఇండోనేషియా కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు.
……………………………………………….