* ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్ళింపు
* రూ. 15 కోట్లతో సరికొత్త బ్రిడ్జీ నిర్మాణం
* రూ.58 కోట్లతో నాలా రిటెయినింగ్ వాల్స్
* వర్షాకాలానికి ముందే అందుబాటులోకి రావాలన్నదే లక్ష్యం
ఆకేరు న్యూస్, వరంగల్ : నయీంనగర్ పెద్దమోరిని కూల్చేస్తున్నారు. హనుమకొండ – కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న నయీంనగర్ పెద్ద మోరిని అధికారులు రెండు రోజుల్లో కూల్చేయనున్నారు. వర్షా కాలంలో కురిసిన కుండ పోత వర్షాల వల్ల వరంగల్ నగరమంతా జలమయమయింది. నాలాలు పొంగి ప్రవహించాయి. ప్రధాన రహదారుల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది . నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పడవల్లో వెళ్ళి అధికారులు ప్రజలకు అవసరమైన సాయం చేయాల్సి వచ్చింది. వరంగల్ నగరంలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు పెద్ద ఎత్తున కబ్జాకు గురి కావడంతో ఈ దుస్థితి నెలకొనడనంతో నగరంలోని కాలనీలు వరదలతో నిండి పోయి చెరువులను తలపించింది. వరద ముప్పుకు ప్రధాన అంశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో బ్రిడ్జీల నిర్మాణం, నాలాల వెడల్పు కార్యక్రమంతో పాటు రిటెయినింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే హనుమకొండ- కరీంనగర్ ప్రధాన రహదారిలో ఉన్న నయీంనగర్ పెద్ద మోరీని కూల్చేస్తున్నారు. ఇప్పటికే కూల్చేయడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు చేపట్టారు.
* రూ. 75 కోట్ల మంజూరి
నాలా వెడల్పు కార్యక్రమంతో పాటు వరద ముప్పును తప్పించేందుకు రెండు వైపుల రిటెయినింగ్ వాల్స్‌ను నిర్మిస్తున్నారు. నయీంనగర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ గుండ్ల సింగారం మెయిన్ కెనాల్ వరకు రిటెయినింగ్ వాల్స్‌ను సాగునీటి శాఖ అద్వర్యంలో నిర్మిస్తున్నారు. నయీంనగర్ బ్రిడ్జీ నిర్మాణం కోసం రూ. 15 కోట్లు మంజూరి చేశారు. జాతీయ రహదారుల శాఖ అద్వర్యంలో ఈ బ్రిడ్జీ నిర్మాణం చేపడుతున్నారు. రెండు కోట్ల రూపాయలతో గ్రేటర్ వరంగల్ మునిసిపాలిటీ తాగునీటి పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నారు.
ట్రాఫిక్ మళ్ళింపు
పుష్పాంజలి పంక్షన్ సమీపం నుంచి సమ్మయ్య నగర్ లేదా రంగ్ బార్ మీదుగా యూనివర్సిటీ జంక్షన్‌కు తరలిస్తారు. మరోవైపు కిషన్‌పుర లేదా మర్కజీపాఠశాల సమీపం నుంచి పెగడపల్లీ డబ్బాల రోడ్ నుంచి యూనివర్సిటీ జంక్షన్‌కు తరలిస్తారు. కాజీపేట నుంచే వాహనాలను 100 ఫీట్ రోడ్ మీదుగా యూనివర్సిటీ జంక్షన్‌కు తరలిస్తారని తెలిస్తోంది. ఇతర ప్రత్యమ్నాయా మార్గాలను కూడా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
————————–