ఎన్ ఎంఎంఎస్ లో సత్తా చాటిన తాటికొండ విద్యార్థులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు నారబోయిన లక్ష్మీ ప్రసన్న, ముంత అశ్విని, మావురపు ప్రమోద, లావుడ్య గణేష్, కుంభోజు సంతోష్ లు (ఎన్ ఎంఎంఎస్) నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపిక అయినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనుమాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. గత నవంబర్ లో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు హాజరుకాగా అందులో ఐదుగురు విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు 48,000 రూపాయలు స్కాలర్షిప్ గా అందనుంది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు పెనుమాటి వెంకటేశ్వర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ బేతి మంజుల అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రుద్ర, లింగమూర్తి, రంజిత్ కుమార్, శ్రీనివాస్, రవీందర్, శ్రీనివాస్, మురళి, అనసూయ, కృపమ్మ, సలావుద్దీన్, జగదీశ్వర్, రవి తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
