ఆకేరున్యూస్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రaాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వైద్య కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ- పిల్లల ఐసీయూలో)లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం 10 మంది నవజాత శిశువులు మరణించారు. అయితే అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న తర్వాత ఆస్పత్రిలో గందరగోళం చోటుచేసుకుంది. పేషెంట్స్, వారి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది.
…………………………………