Published:
Updated: 16 Nov 2024 • 10:51 AM
* వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు
ఆకేరున్యూస్, బాసర: విద్యార్థిని ఆత్మహత్యపై బాసర ఆర్జీయూకేటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో విద్యాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు తరలివస్తుండటంతో బాసర రైల్వే స్టేషన్, అమ్మవారి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఏబీవీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు జర్నలిస్టుల సెల్ఫోన్లు తీసుకుని వీడియోలను డిలీట్ చేశారు.
………………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
