* 31 లక్షల మందికి ప్రయోజనం
* శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ ప్రకటన
ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ అంచనా ప్రకారం.. కొత్తగా పది లక్షల కొత్త రేషన్ కార్డుల మంజూరు ఉండవచ్చని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుకి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను కుడా ఆధారం చేసుకుంటామన్నారు. అలాగే కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో.. ప్రభుత్వంపై అదనంగా రూ.956 కోట్ల భారం పడుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను జారీ చేయబోతున్నట్లు ఉత్తమ్ వెల్లడిరచారు.
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అదనపు పేర్ల నమోదుకు.. మీ సేవ కేంద్రం ద్వారా గడిచిన పదేళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండిరగ్లో ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం నియమించారని చెప్పారు. తనను ఛైర్మన్గా, సహచర మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ ఉప సంఘం పలుమార్లు సమావేశమై.. సిఫారసులను కేబినెట్ ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను చేబడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
………………………………………