ఆకేరు న్యూస్, మెదక్ : ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరగడంతో సీపీఆర్(CPR) పై వైద్యులు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. చాలా సందర్భాల్లో సీపీఆర్ ద్వారా బాధితుల ద్వారా ప్రాణాలు నిలిపిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే.., ఆప్పుడే పుట్టిన శిశువు గుండె ఆగి మరణించడంతో 108 సిబ్బంది సీపీఆర్ చేసి శిశువు ప్రాణాలు నిలిపారు. మెదక్ ప్రభుత్వ ఆస్పత్రి(MEDAK GOVERNMENT HOSPITAL)లో పుట్టిన చిన్నారికి శ్వాస ఆడక ఇబ్బందులు తలెత్తాయి. అక్కడి వైద్యులు పెద్ద ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో తల్లిదండ్రులు శిశువును హైదరాబాద్ (HYDERABAD)లోని నీలోఫర్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో గుండె ఆగిపోయింది. వెంటనే స్పందించిన 108 సిబ్బంది శిశువుకు సీపీఆర్ చేశారు. పైలట్ నవీన్, ఈఎంటీ రాజు నవజాత శిశువు ప్రాణాలు కాపాడారు. అనంతరం నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
