
* లోక్‌సభలో వాయిదాలపర్వం!!
* ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ విపక్షాలపై రిజిజు ఫైర్
ఆకేరు న్యూస్, డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ ఆందోళనల మధ్యే ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఆపరేషన్ సిందూర్, తదితర అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. నినాదాలను హోరెత్తించాయి. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. గందరగోళం మధ్య స్పీకర్ ఓం బిర్లా (Speaker Om birla) మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. అనంతరం కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో లోక్ సభ రేపటికివాయిదా పడింది. బిహార్ ఓటర్ జాబితా రివిజన్‌పై కేంద్రానికి వ్యతిరేకంగా చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై కేంద్ర మంత్రి రిజిజు (Rijiju) స్పందిస్తూ చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని చెప్పినా సభను ఎందుకు సజావుగా సాగనివ్వడం లేదని విపక్షాలను ప్రశ్నించారు. ఈ డబుల్ స్టాండర్డ్ తప్పు అన్నారు. మీరు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. అటు రాజ్యసభ సైతం రేపటికి వాయిదా పడింది.
………………………………………………..