
* చత్తీస్ గడ్ సీఎం విష్ణుదేవ్ సాయి ముందు లొంగుబాటుకు ఏర్పాట్లు
ఆకేరు న్యూస్ ,వరంగల్ : మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తో పాటు 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం బస్తర్, మాఢ్ డివిజన్ కమిటీలలో అత్యంత కీలక నాయకుల్లో ఒకరైన తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ తో పాటు 130 మంది మావోయిస్ట్‌లు ఆయుధాలతో చత్తీష్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో లొంగిపోనున్నారు.
*లొంగిపోతున్న మావోయిస్టుల వివరాలు
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నాయకులు భాస్కర్ మాండ్వి, రాజు సలాం, రీజనల్ కమిటీ మెంబర్ రతన్ ఆలం, డివిజన్ కమిటీ సభ్యులు ప్రసాద్ తరం, డివిజన్ కమిటీ సభ్యుడు హిరాలాల్ కొమ్రా, డివిజన్ కమిటీ మెంబర్ నందే, కంపెనీ నంబర్ 5 కమిటీ సభ్యుడు జుగ్నూ కవాచి, పార్తాపూర్ డివిజన్ కమిటీ సభ్యుడు నరసింగ్ నేతం, జన మిలీషియ కమిటీ ప్రతినిధి జుట్రు పొడియం, పార్టీ సభ్యులు అంకిత ఓయం, రీనా మాద్వి, కమల, మాంకీ కుహురం, బుద్ని నుక్తి, ప్లాటూన్ మెంబర్ కమ్లు కచ్లం, పార్తాపూర్ ఏరియా కమాండర్ రామ్లీ బెర్దా, ఏరియా కమిటీ సభ్యుడు సోమేర్ పొడియం, నార్త్ బ్యూరో టెక్నికల్ డిపార్ట్ మెంట్ మెంబర్ దిలీప్ ఆయం, పార్టీ మెంబర్ జ్యోతి మిడియం, డివిజన్ మెంబర్ మనిషా జుర్రి, జానే ఓడీ, కాంతి అలామి, రావుఘాట్ ఏరియా కమిటీ కార్యదర్శి మీనా నేతం, పార్టీ మెంబర్ మనీలా ఓయం, ప్లాటూన్ 1 కమిటీకి చెందిన పునిత పొడియం, మూంగ్లీ మాండ్వి, అశోక్ పొడియం, పార్టీ మెంబర్ (దర్జీ) సోనీ మార్కం, సప్లై విభాగానికి చెందని కళ, జమున, సురేష్ మాండవి, మాండవి జోగి, హుంగీ, పద్మ నరెట్టి, ప్లాటూన్ కమిటీ నంబర్ 5 మెంబర్ రాం కొర్రం, మహేష్ దోడి, సంగీత కోర్చా, ముంగ్లీ పుద్దా, ప్లాటూన్ నంబర్ 1కు చెందిన ఆశా ధృవ, విజ్జి సోడి, సునిత కుంజమ్, సవితా కవాచి, జుగ్నీ కవాచి, రజనీ కేడం, బతి ఊర్సా, రమేష్ దుగ్గా, సీతే వహకో, కవిత, లింగూ వర్దా, మానూ మాండవ్ లు ఉన్నారు. వీరు ఏకె 47, ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ తో పాటు పలు ఆయుధాలను కూడా ప్రభుత్వానికి అప్పగించనున్నారు. దండకారణ్య అటవీ ప్రాంతం నుండి బుధవారమే వీరిని కాంకేర్ జిల్లాకు తరలించిన బలగాలు గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయయే అవకాశాలున్నట్లు సమాచారం .
………………………………………………………………………………………..