![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-1-10.jpg)
* ఎస్జీటీలుగా నియామకం
* నెలకు రూ.31,030 చొప్పున వేతనం
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చినప్పటికీ దానిని కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకోలేదు. దీంతో మరోమారు డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. డీఎస్సీ-2008లో నష్టపోయిన మొత్తం 1399 మంది అభ్యర్ధులకు విద్యాశాఖ వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వారందరినీ ఎస్జీటీలుగా నియమిస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. వీరికి వేతనం కింద నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు.
……………………………….