* వాహనదారులు మీ గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలి
* అదే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యం
* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ఆకేరున్యూస్, వరంగల్: మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా గత వారంలో 28 మంది వాహనదారులు జైలు శిక్ష అనుభవించారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగాకాని, పరోక్షంగాకాని రోడ్డు ప్రమాదాలకు ప్రధానకారకులు అవుతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలలో మృత్యువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. తద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని.. ఇది దృష్టిలో వుంచుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ మద్యం సేవించి వాహనదారుల వలన కలిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇందులో భాగం వరంగల్ ట్త్రెసిటి పరిధిలో ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్ధర్ పోలీసులు నిరంతరం డ్రంకెన్ డ్త్రెవ్ తనీఖీలు చేపట్టడం జరుగుతుందని… అలాగే గ్రామీణా ప్రాంతాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్త్రెవ్ తనీఖీలు నిర్వహించబడుతున్నాయి. ప్రధానం వరంగల్ ట్త్రె సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టే డ్రంకెన్ డ్త్రెవ్ తనీఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ముందుగా కమిషనరేట్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్త్రెనింగ్ సెంటర్ వాహనదారుల కుటుంబ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి.. అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుటహాజరుపరుస్తున్నామని పేర్కొన్నారు. దీంతో వాహనదారులకు కోర్టులో జైలు శిక్ష లేదా జరిమానా విధించడం జరుగుతుందన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో గత వారం రోజుల్లో ట్రైసిటి ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా జరిపిన డ్రంకెన్ డ్త్రెవ్ తనిఖీల్లో మొత్తం 387 కేసులు నమోదు కాగా, ఇందులో 28 మందికి వాహనదారులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, 4లక్షల 70వేల ఆరువందల రూపాయలు వాహనదారులు ఫైన్ రూపంలో కోర్టులో జరిమానాలు చెల్లించారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నమోదైన కేసుల్లో అత్యధికంగా కాజిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 కేసులు నమోదు కాగా ఇందులో 14 మందికి జైలు శిక్ష పడిరదన్నారు. అలాగే వరంగల్లో 122 కేసులో 11మందికి జైలు శిక్ష.. హన్మకొండ పరిధిలో మొత్తం 121 కేసులు నమోదు కాగా ఇందులో ముగ్గురికి జైలు శిక్ష పడిరదని పోలీస్ కమిషనర్ వెల్లడిరచారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ వాహనదారులకు సూచన చేస్తూ మీ కుటుంబాన్ని దృష్టిలో వుంచుకుని వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపవద్దని, మీరు చేసే తప్పిదాలతో ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయినవారు కొందరైతే మరి కొందరు ఆంగవైకల్యంగా జీవితాలను కొనసాగిస్తున్నారని. ఇకనైన వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని. వాహనదారులు మీ గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
……………………………..
