* పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, మేయర్, మున్సిపల్ కమిషనర్
ఆకేరున్యూస్, హన్మకొండ: గ్రేటర్ వరంగల్ పరిధిలోని యాదవ నగర్ పెట్రోల్ పంప్ మూలమలుపు, పెద్దమ్మ గడ్డ మూలమలుపు, భద్రకాళి దేవస్థానానికి సంబంధించిన పార్కింగ్ స్థలాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్ అండ్ బి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈసందర్భంగా అభివృద్ధి చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు. భద్రకాళి దేవస్థానం ఆవరణలో వాహనాల పార్కింగ్ అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్ సూచించారు.కుడా పీవో అజిత్ రెడ్డి, హౌసింగ్ పీడీ రవీందర్, ఈఈ భీమ్ రావు, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
