* భారీగా మావోయిస్టుల లొంగుబాటు
* డీజీపీ ఎదుట 37 మంది సరెండర్
* అజ్ఞాతం వీడిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు
* ఏకే 47, ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం
* సెంట్రల్ కమటీలో 9 మంది ఉంటే..
అందులో తెలంగాణ వారే 5 గురు
* మీడియాకు వివరాలు వెల్లడించిన రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ ఇచ్చిన పిలుపుతోనే భారీగా మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలుస్తున్నారని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన 37 మంది సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మిగితా సభ్యులు సైతం లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. 37 మందిలో దక్షిణ బస్తర్‌కు చెందిన 22 మంది ఉన్నారని.. 9 మంది ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యులు.. మిగితా వారు ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వారు ఉన్నట్లు చెప్పారు. కోయ సాంబయ్య అలియాస్ ఆజాద్‌పై రూ. 20 లక్షల రివార్డు ఉందని.. మొత్తం 37 సభ్యులపై ఉన్న రూ. ఒక కోటీ 42 లక్షలను లొంగిపోయిన సభ్యులకు అప్పగించారు. 303 రైఫిల్స్, జీ3 రైఫిల్స్, ఎస్ ఎల్ ఆర్లు, ఏకే 47తోపాటు బుల్లెట్లు అప్పగించిన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర కమిటీలో 9 మంది ఉంటే.. అందులో తెలంగాణానుంచి 5 గురు ఉన్నారని.. ఇంకా రాష్ట్ర కమిటీలో ఉన్న దామోదర్, వెంకన్న లొంగిపోవాలని సూచించారు. తెలంగాణాలో సీఎం ఇచ్చిన పిలుపుతో 11 నెలల్లో 465 మంది సభ్యులు (వివిధ క్యాడర్ ) చెందిన మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున పునరావాసం కల్పిస్తామని డీజీపీ చెప్పారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే తాము పార్టీని వీడుతున్నట్లు ఆజాద్, ఎర్రా మీడియాకు తెలిపారు. పార్టీ పెద్దలకు చెప్పే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మిగితా సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

