* డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు 406 కోట్ల నిధులు విడుదల
* ఏడాది మొత్తానికి సరిపడా నిధులు ముందే విడుదల చేసిన డిప్యూటీ సీఎం,
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు
* సీనియర్ రేసిడెంట్ డాక్టర్లు, టీచింగ్ మెడికల్ స్టాప్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి బిగ్ రిలీఫ్
పేద ప్రజలకు వైద్య సేవలు అందించే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (Director of Medical Education) సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలన్న ఆలోచనతో.. ఏడాదికి సరిపడా బడ్జెట్ 406.75 కోట్ల రూపాయల నిధులను విడుదల (Release of Funds) చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM and Finance Minister Bhatti Vikramarka) ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister of Health Damodara Rajanarsimha) అంతా కలిసి ఉమ్మడిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తాజా నిర్ణయంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (Director of Medical Education) పరిధిలో పనిచేస్తు గౌరవ వేతనం, ఉపకార వేతనం పొందుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, మెడికల్, నర్సింగ్, టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బందికి ఇక వేతనానికి సంబంధించిన ఇబ్బందులు ఉత్పన్నమయ్య సమస్యలేదు.
————————