* మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు
* బుద్దభవన్ వద్ద కాంగ్రెస్, బీఆర్ ఎస్ పోటాపోటీ ఆందోళనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ మహిళా కమిషన్ (Telangana State Commission for Women) ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నెలకొంది. కేటీఆర్‌ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, కేటీఆర్ కు మద్దతుగా కార్పొరేటర్లు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి మాట్లాడుతూ.. మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. బుద్ధభవన్(Budhabavan) లోపలికి కేటీఆర్‌ను మాత్రమే అనుమతించారు. అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల(Woman Corporaters) ను లోనికి రానివ్వలేదు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఆందోళన చేపట్టారు. మరోవైపు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, నేతలు బుద్ధభవన్ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మహిళా లోకాన్ని ఆయన అవమానించారని విమర్శించారు. పోటాపోటీ ఆందోళనలతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ (Brs), కాంగ్రెస్(Congress) మహిళా నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
————————————–