* కోర్టు వ్యతిరేకంగా తీర్పునిస్తే.. నేనే కూల్చివేయించేవాడిని
* అది పట్టా భూమి.. అంగుళం కూడా ఆక్రమించలేదు
* మాకు ఎటువంటి నోటీసులూ జారీ చేయలేదు: అక్కినేని నాగార్జున
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాదాపూర్లోని ఎన్ కన్వెషన్(N. Convention) సెంటర్ను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkatreddy) ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై ఎన్. కన్వెన్షన్ యజమాని, టాలీవుడ్ హీరో నాగార్జున (Hero Nagarjuna) స్పందించారు. కూల్చివేత బాధాకరమన్నారు. స్టే ఆర్డర్(Stay Order)లు , కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టారు. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం , చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేస్తున్నా అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అని నాగార్జున ట్వీట్( Nagarjuna Tweet)లో పేర్కొన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడిందన్నారు. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడినన్నారు. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందన్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశమన్నారు.
————————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
