
* మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
* ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్న జనం
* 45 రోజులపాటు సాగనున్న మహా కుంభమేళా
ఆకేరున్యూస్, ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు భక్తులు తరలివస్తున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించారంటే అతిషయోక్తి కాదు. సంక్రాంతి సందర్భంగా అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నాగా సాధువులు, సంతులు తొలి రాజస్నానం (షాహి స్నాన్)లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాఖా సాధువులు త్రివేణీ సంగమంలో తొలి స్నానాలు ఆచరించగా.. వారిపై రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించింది. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. సంక్రాంతి రోజున ప్రారంభమైన మహా కుంభమేళా శివరాత్రి రోజున ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడిరచారు.
………………………………………….