* సెప్టిక్ ట్యాంక్లో పడ్డ బాలుడు.. పరిస్థితి విషమం
* ఆస్పత్రిలో నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
ఆకేరు న్యూస్, పెద్దపల్లి : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు తల్లితో పాటు వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్లో పడిపోయాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మంగళ వారం మహబూబాబాద్ కు చెందిన కూలీలు రాములమ్మ, శ్రీనివాసుల కుమారుడు విలియమ్స్ (7) ప్రభుత్వాసుపత్రి లోని సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు. గమనించిన సిబ్బంది సెప్టిక్ ట్యాంకు నుండి బాలుడిని వెలికి తీశారు. అప్పటికే సెప్టిక్ ట్యాంక్ (Septic Tank) లోని మురుగునీటిని బాలుడు మింగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రాథమిక చికిత్స జరిపే క్రమంలో పరిస్థితి విషమించడంతో వైద్యులు కరీంనగర్ కు తరలించారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ పెద్దపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతడిని చూసేందుకు తండ్రి వచ్చాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ సెప్టిక్ ట్యాంక్లో పడ్డాడు. ప్రభుత్వాసుపత్రిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సెప్టిక్ ట్యాంక్ హోల్ తెరిచి ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
—————————————————