* ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల విద్యా వనరుల కేంద్రం మహిళ సిబ్బందికి సోమవారం ఘనంగా సన్మానం చేశారు. ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గోరంట్ల యాదగిరి మహిళా అధికార ప్రతినిధి గోరంట్ల నాగరాణితో కలసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కుటుంబానికి ఆధారం, సమాజానికి స్పూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం, అపూర్వమైనవని అలాంటి మహిళా మనులకు సత్కారం అందించిన ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, పిట్టల అజయ్, రేగుల రాకేష్, రేగుల, శ్రీకాంత్, ఎం ఆర్ సి సిబ్బంది సునీత, తులసి, శ్రీలత, సంధ్య, వరలక్ష్మి, రాజా, శిరీష, సంధ్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
