
ఆకేరున్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత తీవ్రమవుతోంది. రైతులు తమ పంటలకు అవసరమైన యూరియాను సకాలంలో పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి 8,100 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదానీ ధమ్రా పోర్టులో ఎంవీ ఓషన్ స్టార్ ద్వారా దిగుమతి చేసుకున్న యూరియాను బీహార్, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు కేటాయించింది. మొత్తం 30,491 మెట్రిక్ టన్నులు దిగుమతి కాగా.. రాష్ట్రానికి 8,100 మెట్రిక్ టన్నులను యూరియాను పంపుతున్నట్లు వెల్లడించారు. బీహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయించారు. రైల్వే రవాణా ద్వారా యూరియాను వేగంగా తరలించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
…………………………………………