ఆకేరు న్యూస్ డెస్క్ : ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 140 కోట్ల జనాభాతో భారత్ చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. కానీ, ప్రస్తుతం జనాభా పెరుగుదల, గతంలో ఉన్నంత వేగంగా లేదు. ఈమేరకు జనాభా పెంపుకోసం కొన్ని దేశాలు వినూత్న చర్యలకు పాల్పడుతున్నాయి. దానిలో భాగంగా రష్యా (Russia) ఓ ఆఫర్ ప్రకటించింది. తమ దేశంలో సంతానోత్పత్తిని పెంచుకునేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఆ దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు (Republic of Karelia Officers) తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక యూనివర్సిటీ (University), కాలేజీల్లో చదివే 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డను కంటే వారికి రూ. 92వేలు బహుమతిగా ఇస్తామంటూ ప్రకటించారు. కాగా దేశంలో సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రవేశపెట్టే ఈ స్కీం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.
అక్కడ కండోమ్స్, గర్భనిరోధక మాత్రలపై నిషేధం
మాస్కోటైమ్స్ (Moscow Times) కథనం ప్రకారం.. జనాభా పెరుగుదల చర్యల్లో భాగంగా కండోమ్స్, గర్భనిరోధక మాత్రలపై రష్యా నిషేధం విధించింది. ప్రతి రష్యా మహిళా ఎనిమిది మందికి జన్మనివ్వాలని గతేడాది డిసెంబర్ లో ప్రభుత్వం విజ్నప్తి చేసిన విషయం తెలిసిందే. మన జాతి సమూహాలలో చాలా మంది నాలుగు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో పెద్ద కుటుంబాలను కలిగి ఉన్న సంప్రదాయం ఉంది. రష్యన్ కుటుంబాలు, మా అమ్మమ్మలు, ముత్తాతలలో చాలా మంది ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చారని… మాస్కోలో జరిగిన ప్రపంచ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్ (Russian People’s Council) లో ప్రసంగిస్తూ పుతిన్ (Putin)అన్నారు. రష్యా ఇటీవల ఉక్రెయిన్ తో యుద్ధంతో రష్యాలోని పలువురు యువకులు మరణించగా..బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటారన్న భయంతో చాలా మంది దేశాలను వదిలి పారిపోయారు.
——————————-