
కోలార్ సమీపంలో బస్సును డీ కొట్టిన లారీ
ఆకేరు న్యూస్, తిరుపతి : బెంగుళూరు ( Bangalore) నుంచి తిరుపతి (Tirupati) వెళ్తున్న బస్సు (Bus) ను లారీ (Larry) ఢీ కొట్టడంతో తీవ్ర విషాదం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా 9 మంది దుర్మరణం (9 people died) చెందారు. మరో 15 మందికి పైగా గాయాలపాలయ్యారు (15 people were injured). స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరు పరిధి కోలార్ (Bangalore Kolar) సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించగా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ బస్సు ప్రయాణికులతో బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
————————