* తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం
* ప్రమాదంలో రామ్‌ప్రసాద్‌కి స్వల్ప గాయాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్‌ప్రసాద్‌కి గురువారం యాక్సిడెంట్ అయ్యింది. షూట్ నిమిత్తం కారులో వెళ్తుండగా.. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడంతో.. రామ్‌ప్రసాద్ కూడా కారుని సడన్‌గా ఆపాల్సి వచ్చింది. దాంతో వెనుక నుంచి అతని కారుని మరో వాహనం ఢీకొట్టడంతో.. రామ్‌ప్రసాద్ తన కారుతో ముందున్న కారుని ఢీకొట్టాడు. ఈ నేపథ్యంలో.. రామ్‌ప్రసాద్ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో రామ్‌ప్రసాద్‌కి స్వల్ప గాయాలయ్యాయి. తోటి వాహనదారులు 108 అంబులెన్స్‌కి ఫోన్ చేయగా.. సిబ్బంది వచ్చి రామ్‌ప్రసాద్‌కి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనకి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
…………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
