* ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది
* ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు సరికాదని ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించిన విషయం తెలిసిందే… ఈ సందర్బంగా కవిత గచ్చిబౌలి స్టేషన్‌కు చేరుకొని బీఆర్ఎస్ నేతలను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి ఏసీపీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని బంజారాహిల్స్ స్టేషన్‌కు వెళ్లగా.. ఏసీపీ లేకపోవడంతో సీఐని ఫిర్యాదు తీసుకోవాలని పాడి కౌశిక్‌రెడ్డి కోరారన్నారు. సీఐని ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డి (KAUSHIK REDDY) పై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ఉదయం 10 గంటలకు అరెస్టు చేస్తే ఇప్పటి వరకు రిమాండ్ చేయలేదని ఆరోపించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు హరీశ్‌రావు( HARESH RAO) , జగదీశ్‌రెడ్డి (JAGADESH REDDY) తో పాటు ఇతర నేతలను కూడా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఫిర్యాదు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదని.. ఇది సరికాదన్నారు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుందని.. పాడి కౌశిక్‌రెడ్డిపై కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కోర్టు మూసిన తర్వాత పంపించాలనే జాప్యం చేస్తున్నారని.. ఇందిరమ్మ రాజ్యం కాదని.. పోలీసుల రాజ్యం నడుస్తుందన్నారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
