* సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై మండిపడ్డ హరీశ్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రజాపాలనలో గాంధీ భవన్‌లోనే ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఆయనను పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించి రాత్రి 8 గంటలకు పోలీసులు విడుదల చేశారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో చూస్తే రేవంత్‌రెడ్డి తెచ్చిన మార్పు ఏదైనా ఉందంటే.. ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు ఏమీ లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా పోలీస్స్టేషన్లు..
ఇవాళ పోలీస్స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారాయని.. ఎఫ్ఐఆర్లు పోలీస్స్టేషన్లలో తయారవతలేవు. గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లో తయారవుతున్నయ్. ఏ సెక్షన్లు పెట్టాలి.. ఎవరిని అరెస్ట్ చేయాలో.. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ నుంచి ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి ఉందన్నారు. పోలీసులు ఉన్నతాధికారులు ఒక విషయం ఆలోచించుకోవాలని.. రేవంత్‌రెడ్డి ఏం శాశ్వతం కాదని.. ఆయన ఇవాళ ఉంటడు.. రేపు పోతడు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం.. మరో ప్రభుత్వం రావొచ్చన్నారు. పోలీసులు చట్టం, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్పా.. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనిచేస్తే పోలీసులు ఇబ్బంది పడుతారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలను ఇబ్బందిపట్టాలన్న పగ, ప్రతీకారంతో రేవంత్‌రెడ్డి పని చేస్తున్నట్లు కనిపిస్తుందని.. ఇప్పటికైనా పగలు ప్రతికారాలు మాని ప్రజలకు మంచి పాలన అందించాలని ధ్వజమెత్తారు.
…………………………………………