ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈసారి ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి వివరాలను ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి అఫీషియల్‌గా ప్రకటించారు.
రిజర్వేషన్ల కేటాయింపు ఇలా..
ఇక కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎస్సీకి రిజర్వ్ చేశారు. రామగుండం కార్పొరేషన్‌కు ఎస్సీ జనరల్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు బీసీ మహిళకు అవకాశం కల్పించారు. మంచిర్యాల కార్పొరేషన్‌కు బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్‌కు బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. అదేవిధంగా 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు, 61 అన్‌రిజర్వ్‌డ్‌గా పెట్టారు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు, గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ చేశారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
