ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది గడుస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే డిసెంబర్ 9న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్కు రేవంత్ రెడ్డి సర్కారు తరపున అధికారికంగా ఆహ్వానం అందించనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9న సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం ఫొటో వైరల్ అవుతోంది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న కంకులు పట్టుకున్న రూపంలో తెలంగాణ తల్లి రూపం ఉంది.
……………………………….