* 40 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చింతల్ లోని శ్రీచైతన్య పాఠశాల(SRI CHAITANYA SCHOOL)లో కలకలం రేగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాత్రూంలోని యాసిడ్ వాసన పీల్చడంతో వాంతులు చేసుకున్నట్లు తెలిసింది. పాఠశాల యాజమాన్యం(SCHOOL MANAGEMENT) వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. విద్యార్థి సంఘాల నేతలతో కలిసి పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
………………………………