ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్ చోరీ చేసి ఓ దొంగ హల్చల్ చేశాడు. హయత్‌నగర్‌లోని ఓ దవాఖాన వద్ద ఆపి ఉన్న 108 అంబులెన్స్‌ను చోరీ చేసి దొంగ పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దీంతో అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతివేగంతో విజయవాడ వైపు పరారయ్యాడు. ఈ క్రమంలో చిట్యాల వద్ద పట్టుకునేందుకు ప్రయత్నించగా ఏఎస్ జాన్ రెడ్డి అనే వ్యక్తిని ఢీకొట్టి పారిపోయాడు. అనంతరం కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్గేట్ వద్ద గేటును ఢీకొట్టి వేగంగా దూసుకెళ్లాడు. కాగా, సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుపై లారీలు అడ్డంగా పెట్టిన పోలీసులు.. చివరికి దొంగను పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్టు గుర్తించారు.
…………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
