* మోహన్‌బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారని ప్రచారం
* ఆ వార్తల్లో నిజం లేదన్న మంచు ఫ్యామిలీ
ఆకేరు న్యూస్ సినీ డెస్క్ : ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు(MANCHU MOHANBABU) కుటుంబంలో మంటలు అంటూ కొన్ని మీడియా చానళ్లు ప్రచారం చేశాయి. ఒకరిపై మరొకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. మంచు మనోజ్(MANOJ)తో పాటు అతడి భార్యపై మోహన్ బాబు దాడిచేశాడని ఆయన కొడుకు హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయాలతోనే మనోజ్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తండ్రిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మోహన్‌బాబు కూడా అదే పోలీస్ స్టేషన్లో కొడుకు మనోజ్‌పై ఫిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్ తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారని కథనాలు వెలువడ్డాయి. టాలీవుడ్(TOLLYWOOD)లో ప్రముఖ నటుడిగా ఉన్న మోహన్ బాబు కుటుంబంలో విబేధాలు రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మంచు ఫ్యామిలీ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. మోహన్‌బాబుకు చెందిన పీఆర్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆధారాలు లేకుండా కొన్ని మీడియా చానళ్లు ఊహాజనితమైన కథనాలు ప్రసారం చేశాయని పేర్కొంది.
…………………………..