* నలుగురు మృతి
* మరో నలుగురికి తీవ్రగాయాలు
* కొండగట్టు అంజన్నను దర్శించుకుని వెళ్తుండగా ఘటన
ఆకేరున్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టగా.. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులు ఇటీవల కొన్న కారుకు కొండగట్టు అంజన్న ఆలయంలో పూజ చేయించుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. బాధితులంతా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
