* రైళ్ల ప్రయాణానికి అంతరాయం, ఉప్పల్ లో 20 నిమిషాలు ఆగిన వందేభారత్
* హుజురాబాద్ – పరకాల మధ్యన గల రైల్వే గేటు తీర్చుకోక వాహనదారులకు తీవ్ర పడిగాపులు
* మాన్యువల్ పద్ధతిలో మెమో ఇట్చి రైళ్లను పంపిస్తున్న రైల్వే అధికారులు
ఆకేరు న్యూస్ కమలాపూర్: కాజీపేట- బల్లార్ష మధ్యలో గల ఉప్పల్ రైల్వే స్టేషన్ మీదుగా రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఉప్పల్ – జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య సాంకేతిక కారణాలతో రైల్వే ట్రాక్ పైగల సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయక, పూర్తిగా విఫలం కావటంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి బల్లర్షా వెళ్లాల్సిన వందేభారత్ 20 నిమిషాలు ఉప్పల్ స్టేషన్లో ఆగాల్సి వచ్చింది. ఇదేవిధంగా కాజీపేట- బల్లార్ష మధ్య ఉప్పల్ మీదుగా వెళ్లాల్సిన అన్ని రకాల రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.ఆలస్యాన్ని నివారించటానికి రైల్వే అధికారులు మానువల్ పద్ధతిలో మెమో రాసి రైళ్లను ముందుకు పంపిస్తున్నారు. కాగా సిగ్నల్ సమస్య పరిష్కారానిక రైల్వే అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
రైల్వే గేటు తెరుచుకోక వాహనదారులకు ఇబ్బంది
రైల్వే స్టేషన్ కు సంబంధించిన సిగ్నల్ సరిగా పని చేయకపోవడంతో హుజురాబాద్ – పరకాల మధ్యన గల ప్రధాన రహదారి ఫై ఉన్న రైల్వే గేట్ ఇంటర్ లాకింగ్ తెరచుకోక వాహనాలు బారులు తీరాయి. గేటు గంటల తరబడి తెరుచుకోకపోవడంతో వాహనాలు వెనక్కి వెళ్తున్నాయి. ఆర్టీసీ బస్సులు గేటు వరకే నడుస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు రైల్వే ట్రాక్ మీదగా, గేటు కింద నుంచి అవస్థలు పడుతూ గేటును దాటుతున్నారు.
…………………………………