* ఎమ్మెల్యే హరీశ్ రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అశాంతి, అలజడితో రాష్ట్రం అట్టుడుకుతుందని ధ్వజమెత్తారు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని.. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మంలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని.. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే రాళ్ల దాడి చేశారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాది పాలనలో బడి పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ నడిరోడ్డు మీదికి ఈడ్చారన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు ప్రారంభించి అరాచకం సృష్టించారని… మద్యం విక్రయాలు పెంచాలని మెమోలు ఇచ్చారన్నారు.
…………………………