* పలు సూచనలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణ ప్రధాన ముఖద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
…………………………………….