* చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
* జర్మన్ పౌరుడే అని పేర్కొన్న న్యాయస్థానం
* రూ. 30 లక్షలు జరిమానా విధింపు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్(CHENNAMANENI RAMESH)కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జర్మన్ పౌరుడే(JARMAN CITIZEN) అని స్పష్టం చేసింది. రమేశ్ పిటిషన్ ను సోమవారం డిస్మిస్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కోర్టు తెలిపింది. 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించడంపై మండిపడింది. రూ. 30 లక్షలు నష్టపరిహారం విధించింది. అప్పట్లో చెన్నమనేని రమేశ్ పై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు; మరో వైపు రూ. 5 లక్షలను లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని కూడా హైకోర్టు(HIGH COURT) ఆదేశించింది.
………………………………………