* పెద్ద మనుషుల సమక్షంలో కొనసాగుతున్న చర్చలు
* చర్చ ల్లో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్
* వివాదాల నేపథ్యంలో విదేశాల నుంచి హైదరాబాద్‌కు విష్ణు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ప్రముఖ నటుడు మోహన్‌బాబు (MOHANBABU) కుటుంబంలో ఆస్తి పంపకాల నేపథ్యంలో మొదలైన వివాదాలు ఇంకా సద్దుమణగలేదు. నిన్న పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్(MANCHU MANOJ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిందని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకు పది నిమిషాల్లోనే మోహన్‌బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ తనపై దాడి చేశారని, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పెద్ద మనుషులు రంగంలోకి దిగారు. వివాదాన్ని సద్దుమణిగేలా చేసే ప్రయత్నం చేస్తున్నారు.
జల్పల్లి(JALPALLI)లోని మోహన్‌బాబు ఇంట్లో మంటలు ఆరేలా చర్చలు కొనసాగుతున్నాయి. సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ చర్చల్లో పాల్గొన్నారు. వివాదం నేపథ్యంలో విదేశాల నుంచి విష్ణు(VISHNU) హైదరాబాద్ కు వచ్చారు. విమానాశ్రయం నుంచి ఇంటికి ఆయనను మోహన్‌బాబు తీసుకొచ్చారు. విష్ణు వచ్చిన తర్వాత మరోసారి చర్చలు జరిగాయి. నిన్న కూడా పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిగాయి కానీ.. సఫలం కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలపై ఉత్కంట ఏర్పడింది. వివాదాల నేపథ్యంలో మోహన్‌బాబు ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.
……………………………………………….