ఆకేరున్యూస్, అమరావతి: నటుడు, నిర్మాత, జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు ఏపీ కేబినెట్లో చోటు దక్కింది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంతకీ నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారో అని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో 24 మంది మంత్రులున్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాల ప్రకారం 25 మందిని మంత్రి వర్గంలోకి తీసుకునే వీలుంది. మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని తాజాగా నాగబాబుతో భర్తీ చేయాలని నిర్ణయించారు. జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
……………………………………….