ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, గురుకుల హాస్టల్లలో ఫుడ్ పాయిజన్ (Food poision) ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్‌లోని సాయిపూర్లో గురుకుల పాఠశాల హాస్టల్(Gurukula patasala Hostel) లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో దాదాపు 15 మంది వరకు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆహారం బాగుండడం లేదని కొన్ని రోజులుగా విద్యార్థినులు ఆందోళన చేస్తుండడం గమనార్హం. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు హాస్టల్ వద్దకు, ఆస్పత్రికి చేరుకున్నారు.
…………………………………………..