* లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు
* ఆయన హైబీపీతో బాధపడుతున్నారు : వైద్యులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విచారణకు హాజరుకావాలని రాచకొండ సీపీ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ మంచు మోహన్‌బాబు (Manchu Mohanbabu)హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తనకు వెంటనే భద్రత కల్పించాలని కోరారు. తాను కోరిన సెక్యూరిటీని పోలీసులు కల్పించలేదని న్యాయస్థానానికి వెల్లడించారు. తన ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కాంటినెంటల్ వైద్యులు మోహన్‌బాబుకు చెందిన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన మెడలో నొప్పి, కాలులో నరానికి సంబంధించిన నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. మానసికంగా బాగా యాంగ్జైటీతో ఉన్నారని తెలిపారు. ఎడమ కంటి కింద కమిలినట్లు గాయాలు ఉన్నాయన్నారు. ఫేస్ సీటీస్కాన్ తీయబోతున్నామన్నారు హైబీపీ(High BP)తో బాధపడుతున్నారని, అందుకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బీపీ ఎక్కువగా ఉంది.. ఈసీజీ తీశాం.. నార్మల్ గానే ఉంది.. నిద్ర రాకపోవడం, నిద్ర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
…………………………………….