ఆకేరున్యూస్, హైదరాబాద్: నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. మోహన్‌బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. పోలీసుల నోటీసులపై స్టే కోరుతూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 24 వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
……………………………….