* ఇన్స్టా పోస్టు వైరల్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : సమంత(Samantha)తో విడాకుల అనంతరం ఇటీవల అక్కినేని నాగచైతన్య(NagaChaitanaya) మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సమంత తాజాగా పెట్టిన పోస్టు ఆసక్తిగా మారింది. తన రాశి, ఆ రాశి వారికి వచ్చే ఏడాదిలో కలిగే ప్రయోజనాలకు సంబంధించి సమంత ఇన్స్టాగ్రామ్(Instagram) లో ఓ పోస్టు పెట్టారు. అందులో వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో అత్యంత విజయవంతంగా ఉంటారని, వారు కొన్ని ముఖ్యమైన విషయాలను సాధించగలిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది మొత్తం బిజీగా ఉంటూ వృత్తి పరంగా మెరుగుదల సాధిస్తారని.. ముఖ్యంగా ప్రేమ, నమ్మకం ఇచ్చే భాగస్వామిని పొందుతారని, అంతేకాదు.. మానసిక, శారీరకంగా బలంగా ఉంటూ పిల్లలను పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందేశం ప్రస్తుతం వైరల్(Viral) అవుతోంది. దీన్నిబట్టి వచ్చే ఏడాదిలో సమంత పెళ్లి చేసుకునే అవకాశాలు కొందరు కామెంట్ చేస్తున్నారు. అంతా మంచే జరగాలని ఆశీర్వదిస్తూ సమంత పోస్టు కు రిప్లయ్ ఇస్తున్నారు.
…………………………………….