* నాలుగు రోజుల పాటు సేవలు బంద్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు బంద్ కానున్నాయి. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ చేయనున్న నేపథ్యంలో ధరణి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి అప్గ్రేడేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఈ నెల 16వ తేదీ వరకు ఈ అప్గ్రేడేషన్ ప్రక్రియ ముగియనుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ధరణి సేవలు అందుబాటులో ఉండవని అధికారులు పేర్కొన్నారు.
……………………….