* పలు సెక్షన్ల కింద కేసు నమోదు
* నాంపల్లి కోర్లులో హాజరుపరిచిన పోలీసులు
* హైకోర్టులో అల్లు అర్జున్ అత్యవసర పిటిషన్
ఆకేరున్యూస్, హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ నెల 4న సంథ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన కారణంతోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 105, 118(1)తీ/ష3(5)దీచీూ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేవతి మృతి కేసులో భాగంగా అల్లు అర్జున్ పై, సినిమా యూనిట్ పై, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అలాగే తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
హైకోర్టులో అల్లు అర్జున్ అత్యవసర పిటిషన్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడంపై చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో దీనిని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని బన్ని తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు.
……………………………..