* షరతులతో కూడిన బెయిల్ మంజూరు
ఆకేరున్యూస్, హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో అరెస్టైన నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జును షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది.
……………………………………………