ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై లోక్సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. రేపు లోక్సభలో ఈ బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడిరచాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు. సోమవారం సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ముందుగా వార్తలు రాగా, తాజాగా మంగళవారం ఈ బిల్లులు లోక్షభ ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
…………………………………