* మీడియాపై కూడా ఆంక్షలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నుంచి పలు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఇన్నర్ లాబీలోకి మాజీ ప్రజాప్రతినిధుల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఇన్నర్ లాబీలోకి నో ఎంట్రీ అంటూ బోర్డులు పెట్టారు. అలాగే అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి వీడియో తీయరాదని మీడియాకు ఆదేశాల జారీ చేశారు. కాగా, అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ ఆంక్షలు విధించడం పట్ల మాజీ ప్రజాప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీలోకి అనుమతించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
………………………………………