Telangana 22A Lands
* హై లెవల్ కమిటీ ఏర్పాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : 22ఏ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 22ఏలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కమిటీకి సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. లా సెక్రటరీ పాపిరెడ్డి, ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు.
22ఏ భూముల సమస్యలపై శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 22ఏ జాబితాలో ఉన్న భూములపై వచ్చే అభ్యంతరాలు, సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా కమిటీ పనిచేయనుంది.
భూముల సమస్యల పరిష్కారానికి అవసరమైన అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. 22ఏ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు ఈ నిర్ణయంతో పరిష్కారం లభించే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
