
* సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య సేవలు అందిస్తాం
* ఎన్నికల ముందు ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటన
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ఇప్పటికే అనేక ఉచిత హామీలతో అదరగొడుతున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆప్ కీలక హామీ ప్రకటించింది. ఢిల్లీలోని సీనియర్ సిటిజన్లు అందరికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. మరోసారి ఆప్ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించేలా సంజీవని యోజన అమలు చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్ తెలిపారు.
………………………………………