* ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
* నిజాబాబాద్ లో ఘటన
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : కుటుంబ కలహాలతో ముగ్గురు పురుగుల మందు తాగగా ఒకరు మృతి చెంది ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నిజామాబాద్ పట్టణంలో జరిగింది.జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన వివరాలను రెండవ టౌన్ పోలీసులు వివరించారు. శివాజీ నగర్లో నివాసం ఉండే దాసరి కిషన్, నాగమణి దంపతులకు దాసరి వంశీ, దాసరి బాలకృష్ణ ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒక కుమారుడికి వివాహం కాగా మరో కుమారుడి వివాహం విషయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో మంగళవారం తల్లి తండ్రితో పాటు పెద్ద కుమారుడు మధ్య గొడవ జరగగా తాను ఆత్మహత్య చేసుకుంటానని పెద్ద కుమారుడు వంశీ పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న తండ్రి కిషన్ తో పాటు తల్లి నాగమణి సైతం కొడుకు చేతిలోంచి పురుగుల మందు డబ్బా లాక్కొని తాగారు. రాత్రి సమయంలో వారి బంధువులు వచ్చి చూడగా పురుగుల మందు తాగి ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. గమనించిన వారు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దాసరి కిషన్ (68) అప్పటికే మరణించగా ఆయన భార్య దాసరి నాగమణి, కుమారుడు దాసరి వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
